Love Mouli Movie | టాలీవుడ్ నటుడు నవదీప్ చాలారోజుల గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). అవనీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పంఖురి గిద్వానీ కథనాయికగా నటిస్తుంది. ఈ సినిమా జూన్7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి అఘోరా పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై చిత్రయూనిట్ కూడా స్పందిస్తూ.. రానా ఉన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచాలి అనుకున్నాం. థియేటర్లో ఈ సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల అందరూ థ్రిల్ ఫీలవుతారని ముందే రివీల్ చేయలేదు అంటూ ప్రకటించింది.
ప్రపంచంలోని మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది. ఆ దొరికిన అమ్మాయిని అతడు ఎలా ప్రేమిస్తాడు అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికెట్‌ను అందజేశారు.