Baahubali The Epic | తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఐకానిక్ బ్లాక్ బస్టర్ సినిమా ‘బాహుబలి’ మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 10 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. (బాహుబలి: ది ఎపిక్) BaahubaliTheEpic పేరుతో రెండు భాగాలను ఒకే పార్ట్‌గా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే ఈ రీ రిలీజ్ వెర్షన్‌కి సంబంధించిన రన్‌టైం ప్రస్తుతం వైరలవుతున్న విషయం తెలిసిందే. దాదాపు 5 గంటల 27 నిమిషాల రన్‌టైంతో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు బుక్ మై షోలో ఇప్పటికే ఇంట్రెస్ట్‌లు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా రన్‌టైంపై తాజాగా స్పందించాడు నటుడు రానా.
ఆయన నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. కేరాఫ్ కంచెరపాలెం నిర్మాత ప్రవీణ పరచూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో రానా మాట్లాడుతూ.. బాహుబలి: ది ఎపిక్ రన్‌టైం(BaahubaliTheEpic Runtime)పై స్పందించాడు.
బాహుబలి ఎంత రన్‌టైం ఉన్న నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏ సినిమా చేయకుండానే రీ రిలీజ్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేస్తాను. నాకు కూడా కరెక్ట్‌గా తెలియదు రన్‌టైం గురించి నేను కూడా సోషల్ మీడియాలో వచ్చినవి చూస్తున్నాను. కొందరూ ఏమో నాలుగు గంటలంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై రాజమౌళి మాత్రమే క్లారిటీ ఇస్తారంటూ రానా చెప్పుకోచ్చాడు.