Deepika Padukone | దీపికా పదుకొనే ప్రస్తుతం పూర్తి విశ్రాంతిలో ఉంది. ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఓ కొత్త జీవితాన్ని గడుపుతున్నది. ఇటీవల ఆన్లైన్లో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయిన దీపిక.. తన ప్రెగ్నెన్సీ లైఫ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘ఇన్నాళ్లూ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకునేదాన్ని. ఇష్టమైన ఫుడ్‌ని కూడా అవైడ్ చేసేదాన్ని. ఇప్పుడు కోరింది తింటున్నాను. నేనెంత తింటే నా బేబీకి అంత మంచిదని డాక్టర్ చెప్పారు.
అయితే బయటి ఫుడ్ మాత్రం తినడంలేదు. చక్కగా ఇంట్లో చేసుకునే తింటున్నా. బోర్ కొడితే బయటకెళ్తున్నాను. అయితే పక్కన రణ్వీర్ ఉండాల్సిందే. మా అమ్మానాన్న వచ్చి వెళ్తున్నారు. మొన్నామధ్య రణ్వీర్ పేరెంట్స్ కూడా రెండ్రోజులుండి వెళ్లారు. కుటుంబసభ్యులతో గడపడం ఆనందంగా ఉంది. నేను ఏ మాత్రం ఆందోళన చెందకుండా రణ్వీర్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. డెలివరీ సెప్టెంబర్‌లో ఉంటుందని డాక్టర్ చెప్పారు. కొంచెం టెన్షన్‌గా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది దీపికా పదుకొనే.