Dadasaheb Phalke | భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ (DPIFF) 2025 వేడుకలు ముంబైలో అట్టహాసంగా ముగిశాయి. ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), ఉత్తమ నటిగా కృతిసనన్ (Kriti Sanon) అవార్డులు అందుకున్నారు. తెలుగు చిత్రం ప్రభాస్ నటించిన కల్కి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలువగా.. స్త్రీ 2 (Stree 2) చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డును అందుకున్న విజేతలను చూసుకుంటే.
విజేతల వీరే..
ఉత్తమ చిత్రం – స్త్రీ 2
ఉత్తమ నటుడు -కార్తిక్ ఆర్యన్(చందు ఛాంపియన్)
ఉత్తమ నటి – కృతి సనన్
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ – కల్కి 2898 AD
ఉత్తమ దర్శకుడు – కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్)
క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫిల్మ్- లాపతా లేడీస్
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ – విక్రాంత్ మాస్సే
ఉత్తమ వెబ్ సిరీస్: హీరామండి
ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్): జితేంద్ర కుమార్(పంచాయత్)
ఉత్తమ నటి (వెబ్ సిరీస్) – హుమా ఖురేషి(మహారాణి)
క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ వెబ్ సిరీస్: పంచాయత్ సీజన్ 3
ఉత్తమ నటి (క్రిటిక్స్ – వెబ్ సిరీస్): సోనాక్షి సిన్హా (హీరామండి)
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: యే రిష్తా క్యా కెహ్లాతా హై
చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవ: సీనియర్ నటి జీనత్ అమన్
సంగీత పరిశ్రమకు అత్యుత్తమ సేవ: గాయని ఉషా ఉతుప్
ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్: సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్
ఎక్సలెన్స్ ఇన్ ఇండియన్ సినిమా: నటి శిల్పా శెట్టి