Dada Movie | దాదా సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరో కవిన్ త్వరలో ఓ ఇంటివాడవ్వబోతున్నాడు. ఆగస్టు 20న తన ప్రేయసి మోనికాను ఘనంగా వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినట్లు చెన్నై టాక్. అయితే కవిన్ ఇప్పటివరకు తన ప్రేయసిని పరిచయం చేయలేదు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. ఇక పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది.
సీరియల్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కవిన్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన పిజ్జా సినిమాలో ఓ చిన్న రోల్లో మెరిసాడు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. అయితే కవిన్ పేరు తమిళ ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయింది మాత్రం నట్పున ఎన్నాను తెరియుమా సినిమాతోనే. ఈ సినిమాతో లీడ్ రోల్ అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు. కమర్షియల్‌గా పెద్ద బ్లాక్ బస్టర్ కాలేదు కానీ.. ఈ సినిమాలో కవిన్ రోల్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
కవిన్‌కు మాత్రం బ్రేక్ ఇచ్చింది దాదా సినిమానే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ సినిమా తమిళంలో కోట్లు కొల్లగొట్టింది. కేవలం రూ.4 కోట్లతో రూపొందిన ఈ మూవీ దాదాపు రూ.20 కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించింది. ఇక ఇటీవలే ఓటీటీలో రిలీజై అక్కడ కూడా తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. భాషతో సంబంధంలేకుండా అన్ని రాష్ట్రాల సినీ లవర్స్ ఈ సినిమాను దాదాపుగా చూసేసారు. ప్రస్తుతం కవిన్ రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు.