‘నాన్న తన 63 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. సినీ కెరీర్లో ఎవరూ చేయనటువంటి ప్రయోగాలు, ఛాలెంజింగ్ పాత్రలు చేశారు’ అన్నారు కథానాయిక శృతిహాసన్. విభిన్నమైన సినిమాలతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన కథానాయకుడు కమల్ హాసన్ సినీ రంగ ప్రవేశం చేసి శనివారంతో 63 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ రంగ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రుతిహాసన్ తన తండ్రి కెరీర్‌పై చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ నాన్న సినీ పరిశ్రమలో ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు. అలుపెరగని పోరాటం చేశారు. ఆరు దశాబ్దాలుగా సినీ రంగానికి తన సేవలను అందిస్తున్నారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు శ్రుతి. ఇప్పటి వరకు 230పైగా చిత్రాల్లో నటించిన కమల్‌హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ కలయికలో రూపొందుతున్న ‘కల్కి 2898ఏడీ’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు.