Dacoit | టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోస్లో అడివి శేష్ ఒకరు. ఇప్పటి వరకు ఆయన చేసిన చిత్రాలన్నీ కూడా వైవిధ్యంగా ఉంటాయి. అయితే ఈ హీరో నుండి సినిమా వచ్చి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం మనోడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి గూఢచారి(Goodachari) సినిమాకు సీక్వెల్ గా జీ2(G2) కాగా, మరొకటి డెకాయిట్(Dacoit). ఈ రెండు సినిమాలు ఇప్పుడు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో ముందుగా జీ2 ముందు మొదలు కాగా, ఆ చిత్రమే ఫస్ట్ రిలీజవుతుందని అందరూ అనుకున్నారు. కాని జీ2 కన్నా ముందు డెకాయిట్ రిలీజ్ అవుతుంది. ఈ మూవీని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్టు గ్లింప్స్ ద్వారా తెలియజేశారు.
మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామాగా ‘డెకాయిట్’ రూపొందుతుండగా, దీనికి ఒక ప్రేమ కథ అనేది ట్యాగ్‌టైన్. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా మూవీ నుండి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. గ్లింప్స్ అయితే మూవీపై భారీ అంచనాలు పెంచేసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శేష్ నటించిన క్షణం , గూఢచారి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన షానియల్ డియో డైరెక్టర్ గా ఈ డెకాయిట్ చిత్రం తెరకెక్కుతుండడం విశేషం.. సుప్రియ యార్లగడ్డ , సునీల్ నారంగ్ సంయుక్తంగా ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. మూవీ మాత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఆ మధ్య శృతి హాసన్ ఇందులో నటిస్తుందని పోస్టర్ ద్వారా తెలిపారు. కాని తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని తెలిసింది. డేట్స్ ఇష్యూతో పాటు అడివి శేష్ కూడా కారణం అని తెలుస్తోంది. అడవి శేష్, శృతి హాసన్‌ను కలిసి స్క్రీన్‌పై చూడొచ్చని అంచనాలు పెంచుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.