డాలీ ధనంజయ, సప్తమిగౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘హలగలి’. సుఖేష్ నాయక్ దర్శకుడు. కళ్యాణచక్రవర్తి ధూళిపల్ల నిర్మాత. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ఈ సినిమా గ్లింప్స్‌ని లాంచ్ చేశారు.
ధనంజయ కమాండింగ్ అవతార్‌ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేసింది. ‘ఇది ఎవరికీ తెలియని కథ. ‘హలగలి’ అంటే కర్ణాటకలో గ్రేట్ ఎమోషన్. ఓ గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది.’ అని డాలీ ధనంజయ చెప్పారు. ఇది మన నేల కథ అని, చాలా బిగ్స్కేల్లో నిర్మితమవుతున్న ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని కథానాయిక సప్తమి గౌడ్ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ‘డైరెక్టర్ సుఖేష్ పాషన్‌తో ఈ సినిమా చేస్తున్నారు, ‘హలగలి’ చరిత్రలో ఒక అధ్యాయం. బ్రిటిష్‌కి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం చిరస్మరణీయం. ఒక పార్ట్‌లో చెప్పాల్సిన కథ కాదిది. కర్ణాటక పదవ తరగతి పాంఠ్యాశంలో దీనిపై పాఠం ఉంది. దీనిపై రీసెర్చ్ చేస్తే గూజ్బంప్స్ వచ్చాయి. అంతగొప్ప కథ. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నాం.’ అని తెలిపారు. 40శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని దర్శకుడు పేర్కొన్నారు.