Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “డాకు మహారాజ్” సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కొల్లి బాబీ (కే.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కింది, ఇది ఒక హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందగా, ఈ సినిమా మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. రికార్డు స్థాయిలో రూ. 56 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లను నమోదు చేసింది.”డాకు మహారాజ్” సినిమా విజయానికి కారణాలు బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, అలాగే తమన్ సంగీతం ముఖ్యమైనవి.
సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఇక ఈ సినిమా హిందీ మరియు ఇతర భాషలలో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంకి సంబంధించి డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఓటీటీలో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పుడు ఈ చిత్రం టీవీ ప్రీమియర్కి సిద్ధమైంది. మా టీవీలో జులై 13న సాయంత్రం ఆరు గంటలకి ప్రసారం కానుంది. తాజాగా మేకర్స్ ఇందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది.
ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా మరియు చాందిని చౌదరి కీలక పాత్రల్లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, సచిన్ ఖేడ్ కర్, హిమజ, వీటివి గణేష్, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్ పాండే, సందీప్ రాజ్, రావికిషన్ తదితరులు ఈ సినిమాలో నటించి మెప్పించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. థియేటర్, ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న డాకు మహరాజ్ టీవీ ప్రేక్షకులని ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలి.