Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaaj). వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి తర్వాత మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. అయితే ఈ సినిమా కోసం బాలయ్య ఎంత కష్టపడ్డాడో తెలుపుతూ చిత్రబృందం మేకింగ్ వీడియోను విడుదల చేసింది. కాగా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.