ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై సైబరాబాద్ పోలీసుల సెటైర్
ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి జూన్ 29న సర్ప్రైజ్ పోస్టర్ రిలీజైంది. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతుండగా.. రామ్‌చరణ్ తారక్ భుజాలపై చేతులు వేసి వెనుక కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు.. దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

సినిమా వాళ్లను వాడుకోవడంలో ట్రాఫిక్ పోలీసులు ఆరితేరిపోయారు. గతంలో చాలాసార్లు సినిమా పోస్టర్లను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. వాటి ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనల గురించి ఆసక్తికరంగా ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి తాజాగా విడుదలైన పోస్టర్‌ను కూడా వాడేసుకున్నారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి జూన్ 29న సర్ప్రైజ్ పోస్టర్ రిలీజైంది. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతుండగా.. రామ్‌చరణ్ తారక్ భుజాలపై చేతులు వేసి వెనుక కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు.. దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇందులో ట్రోలింగ్ చేయడానికి ఏముందని అనుకుంటున్నారా? జాగ్రత్తగా చూడండి.. ఆ పోస్టర్లో ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదు. దీనిపై సోషల్‌మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు తమ క్రియేటివిటీని చూపించారు.
Now it is perfect.
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) June 29, 2021
Wear Helmet. Be Safe.@RakeshGoudE @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @ssrajamouli @DVVMovies #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/LDa20NYxCg
పోస్టర్లో బైక్ నడుపుతున్న జూనియర్ ఎన్టీఆర్.. వెనక కూర్చున్న రామ్ చరణ్ కు గ్రాఫిక్స్ లో హెల్మెట్లు తగిలించారు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అంటూ ట్వీట్ చేశారు. హెల్మెట్ లేని ప్రయాణం నేరమని చెబుతూప్రజలకు హితవు పలికారు. హెల్మెట్లతో ఉన్న పోస్టర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సైబరాబాద్ పోలీసులు చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి ప్రజల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్‌పై ఆర్ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. ఇంకా పోస్టర్ పర్ఫెక్ట్ కాలేదు.. హెల్మెట్ మిస్సయిందని కామెంట్ పెట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
కత్రినాకైఫ్ రాఖీ కడతానంటే వద్దన్నారట..స్టోరీ చదవాల్సిందే
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
లిప్ కిస్ టాక్ తో తాప్సీ పబ్లిసిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

