Custody | ఈ వేసవిలో బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. కాగా మూవీ లవర్స్ కోసం డిఫరెంట్ జోనర్ సినిమాలు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతుండగా.. 2023 సమ్మర్లో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమాల్లో టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తున్న కస్టడీ (Custody) చేరడం విశేషం. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న కస్టడీ మే 12న విడుదల కాబోతుంది. ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) ప్రకారం మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ ఫిలిమ్స్ ఆఫ్ ది సమ్మర్-2023లో కస్టడీ టాప్ 10లో నిలిచింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఛత్రపతి మే 12న విడుదలవుతుంది. ఈ చిత్రం ఐఎండీబీ జాబితాలో ఐదో స్థానంలో నిలువగా.. తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్ 9వ స్థానంలో నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో వస్తోన్న కస్టడీని వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్నాడు. NC 22గా తెరకెక్కుతున్న కస్టడీ గ్లింప్స్ వీడియో, టీజర్ టీజ్‌ను ఇప్పటికే లాంఛ్ చేయగా.. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కస్టడీలో నాగచైతన్యకు జోడీగా ఉప్పెన ఫేం కృతిశెట్టి నటిస్తోంది. ఈ మూవీలోపోలీసాఫీసర్ శివగా చైతూ కనిపించబోతున్నాడు.
మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన కస్టడీ ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. కస్టడీలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తుండగా… వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కస్టడీకి సంగీతం అందిస్తున్నారు.
Custody: pic.twitter.com/yYwXlkeT2s
— IMDb India (@IMDb_in) April 19, 2023
నాగచైతన్య కస్టడీ టీజర్ టీజ్..
కస్టడీ గ్లింప్స్ వీడియో..