నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య ధర్మానికి, చట్టానికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు.
సమాజంలోని శక్తివంతమైన వ్యక్తులపై అతని పోరాటం నేప థ్యంలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలబోతగా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. హీరో విలన్‌ను రక్షించడమనే వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అరవింద్‌స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తన్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఆర్.కతీర్, సంగీతం: ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు.