Aamir Khan’s brother | ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఆమిర్ ఖాన్ (Aamir Khan) తమ్ముడు ఫైసల్ ఖాన్ (Faisal Khan) ఇటీవల తన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన ఫ్యామిలీ తనను బలవంతంగా మెంటల్ ఆసుపత్రిలో చేర్పించిందని.. ఇందులో ఆమిర్ ఖాన్ కూడా భాగమయ్యాడని ఫైసల్ ఖాన్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
2002లో నాకు పెళ్లి జరిగింది, కానీ అదే ఏడాది నేను విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోమని ఫ్యామిలీ నన్ను తీవ్ర ఒత్తిడి చేసింది. ఆ పరిస్థితిలో చాలా కుంగుబాటుకి లోనయ్యాను. దీంతో నా పరిస్థితిని వివరిస్తూ.. ఫ్యామిలీలో విడాకులు తీసుకున్న జంటల గురించి ప్రస్తావిస్తూ.. ఒక లేఖ రాశాను. ఆ లేఖ చూసి నా కుటుంబ సభ్యులు నా మానసిక పరిస్థితి బాగోలేదని నేను ఎంత చెప్పిన వినకుండా ఒక మెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మందులు ఇచ్చిన తీసుకోకపోతే బలవంతంగా తీసుకునేలా చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ కూడా నాతో మట్లాడటం తగ్గించింది. నాకు తెలిసి నా కుటుంబంలోని మా అమ్మ నిఖత్, సంతోష్ హెగ్డే, ఇంతియాజ్లు ఆమిర్కి నా గురించి మాయమాటలు చెప్పి అతడిని బ్రెయిన్ వాష్ చేశారు. అందుకే ఆమిర్ నాతో మాట్లాడేవాడు కాదు.
2008 బిగ్బాస్ షోలో పాల్గొనేందుకు నాకు రూ.4 లక్షలు ఆఫర్ వచ్చింది. కానీ ఈ విషయం ఆమిర్కి తెలిసి.. నన్ను తొలగించినట్లు నేను అనుకుంటున్నాను. అందుకే నా కుటుంబంతో న్యాయబద్ధంగా సంబంధాలను తెంచుకోవాలి అనుకుంటున్నాను. దీనిపై నెల రోజుల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను. నాకు ఆమిర్ నుంచి ఏమీ అవసరం లేదు కాబట్టి నేను పరువు నష్టం కేసు వేయను అని ఫైసల్ ఖాన్ తెలిపారు.