హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘సిఎస్ఐ సనాతన్’. మిషా నారంగ్ హీరోయిన్. శివశంకర్ దేవ్ దర్శకుడు. చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సియస్ఐ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది.
ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నది. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్లో మైలురాయిగా నిలుస్తుంది. మార్చి10న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ సోలోమాన్.