హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘సిఎస్ఐ సనాతన్'. మిషా నారంగ్ హీరోయిన్. శివశంకర్ దేవ్ దర్శకుడు. చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
హీరో ఆది సాయికుమార్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సీయస్ఐ) ఆఫీసర్గా నటిస్తున్న చిత్రం ‘సీఎస్ఐ సనాతన్'. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 10న విడుదల చేస్తున్నారు.