చూపే బంగారమాయెనే శ్రీ వల్లి (srivalli song)..కొంతకాలంగా ఎక్కడ చూసినా మార్మోగుతున్న పాట. రీసెంట్గా క్రికెట్ మైదానంలో కూడా బ్రావోతోపాటు బంగ్లాదేశ్ బౌలర్ నజ్ముల్ ఇదే పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మరోవైపు స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప..ది రైజ్ సినిమాలోని పాటకు హుక్ (Srivalli hook step)స్టెప్పులేసి అదరహో అనిపించాడు. మరోవైపు సురేశ్ రైనా, హార్థిక్ డ్వానే బ్రావో వైట్ కాంబినేషన్ టీ షర్ట్ విత్ క్యాప్, చెప్పులు, యెల్లో షార్టులో హుక్ స్టెప్పు వేసి మెస్మరైజ్ చేశాడు.
హార్థిక్ పాండ్యానైతే ఏకంగా బామ్మతో కలిసి హుక్ స్టెప్పులేసి కేక పుట్టించాడు. పుష్ప అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇలా వరల్డ్ వైడ్గా పాపులారిటీ ఉన్న క్రికెటర్లంతా వరుస పెట్టి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పుష్ప సినిమాను ప్రమోట్ చేస్తున్నారా..? ప్రమోషన్ కోసం అమెజాన్ క్రికెటర్లకు రెమ్యునరేషన్ అందజేసిందా..? అన్న గాసిప్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అయితే చాలా మంది సెలబ్రిటీలు కేవలం అల్లు అర్జున్ పై ఉన్న ఇష్టం, పుష్ప సినిమాపై ఉన్న క్రేజ్ వల్లే ఇలా చేస్తున్నారని ఇది ప్రమోషనల్ ఆఫర్ అయితే కాదని మరో డిస్కషన్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అల వైకుంఠపురంలో సాంగ్తో పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ.. ఏదేమైనా మరోసారి శ్రీవల్లి సాంగ్ తో ఓ ఊపు ఊపేస్తున్నాడనంలో ఎలాంటి సందేహం లేదు.
Cutest video on Internet right now! 😍😍#Srivalli Song Hook step ft. @hardikpandya7 and his nani 🧡#PushpaTheRise #Pushpa 💥@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @javedali4u @AlwaysJani @TSeries @MythriOfficial pic.twitter.com/3RN73THaLQ
— Pushpa (@PushpaMovie) January 26, 2022