Sharwanand | టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ లండన్‌లో కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే శర్వానంద్ కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజా గాసిప్స్ ప్రకారం 90స్ బ్యాక్ డ్రాప్లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటించబోతున్నాడట శర్వానంద్.
Loser సిరీస్ ఫేం అభిలాష్ రెడ్డి (Abhilash Reddy) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నట్టు టాక్. సుధీర్ బాబు హీరోగా అభిలాష్ డెబ్యూ (డైరెక్టర్) ఇస్తున్న సినిమా మా నాన్న సూపర్ హీరో. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శర్వానంద్, అభిలాష్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత.. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా లాంఛ్ కానుందని తెలుస్తోంది. పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుందట. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే శర్వానంద్‌తో యూవీ క్రియేషన్స్‌కు ఇది నాలుగో సినిమా కానుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ మూవీలో భాగస్వామ్యం కానున్నారు.
మేకర్స్ రానున్న రోజుల్లో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ వివరాలపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలతో ప్రేక్షకులను పలుకరించాడు శర్వానంద్. టైమ్ లైన్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఒకే ఒక జీవితం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.