Tollywood | 2025 ఫస్ట్ హాఫ్ లో టాలీవుడ్ లో పెద్ద అద్భుతాలు ఏమి జరగలేదు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం కనీసం 100 చిత్రాల్లో 10 విజయాలు సాధ్యమవుతాయని భావించినా… అలాంటిదేమి జరగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిట్ అవుతాయని నమ్మిన సినిమాలు బోల్తాపడగా, రిలీజ్ కావల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు మొత్తం ఫోకస్ 2025 సెకండ్ హాఫ్ మీదే. టాలీవుడ్ ఆశలన్నీ రాబోతున్న నాలుగు వారాలపైనే ఉన్నాయి. ఈ నాలుగు వారాల్లో భారీ బడ్జెట్ సినిమాలు నాలుగు రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వీటిపై భారీ అంచనాలున్నాయి. దాదాపు రూ.1200 కోట్ల పెట్టుబడితో ఈ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఫలితంగా బాక్సాఫీస్ మళ్లీ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాదాపు నాలుగేళ్లుగా చిత్రీకరణలోనే ఉన్న హరిహర వీరమల్లు చివరికి జూలై 24న విడుదలవుతోంది. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా రూ.100 కోట్లు రాబట్టే అవకాశముంది.ఇక పలు ఫ్లాపుల తర్వాత విజయ్ దేవరకొండ కింగ్డమ్ ద్వారా రీబౌన్స్ కావాలని చూస్తున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పైన నాగవంశీ భారీ హైప్ క్రియేట్ చేశారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్స్, టీజర్‌తోనే అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్‌కి ఊపిరి పోస్తుందన్న నమ్మకం ట్రేడ్‌లో ఉంది.మరోవైపు యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న వార్ 2లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ హిందీ మార్కెట్లో పెద్ద హిట్ కొట్టే అవకాశముందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అయితే అదే రోజు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ విడుదల కానుంది. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి భారీ క్యాస్టింగ్ ఉండడంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందని అంటున్నారు. ఈ నాలుగు సినిమాల మొత్తం బడ్జెట్‌ను కలిపితే దాదాపు రూ.1200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం ఈ నాలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. ఒకటి లేదా రెండు సినిమాలు భారీ హిట్స్ సాధించిన, సినిమా పరిశ్రమకు గట్టి బూస్టప్ ఇచ్చే అవకాశముంది. కాగా, హరిహర వీరమల్లు ₹250 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కగా, కింగ్డమ్ బడ్జెట్ వంద కోట్లు, వార్ 2 ₹400 కోట్లు, కూలీకి ₹450కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.