ప్రస్తుతం రామ్‌చరణ్ ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తారు. ఈ రెండు పూర్తవ్వడానికి రెండేళ్లు పట్టడం ఖాయం. అంటే.. రామ్‌చరణ్‌తో సినిమా అంటే ఏ దర్శకుడైనా రెండేళ్లు ఆగాల్సిందే. కానీ.. తమిళ హీరో ధనుష్ మాత్రం రీసెంట్గా రామ్‌చరణ్‌కి కథ వినిపించారట. ఆయన కథ చరణ్‌కు కూడా బాగా నచ్చిందని ఫిల్మ్ వర్గాల సమాచారం. సుకుమార్ సినిమా తర్వాత రామ్‌చరణ్ ఈ సినిమానే చేస్తారని తెలుస్తున్నది. ఒక హీరో మరో హీరోని డైరెక్ట్ చేసే ఆరోగ్యకరమైన సంస్కృతి ఇప్పడైతే లేదు. హీరో ధనుష్ ఆ సంస్కృతికి లేటెస్ట్గా శ్రీకారం చుట్టారని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ధనుష్ ఇప్పటివరకూ డైరెక్ట్ చేసిన కథలన్నీ సమాజంలోనుంచి తీసుకున్నవే. ఆయన సృష్టించే పాత్రలు కూడా సహజసిద్ధంగా ఉంటాయి. రామ్‌చరణ్ కెరీర్లో ఇప్పటివరకూ చేయనటువంటి విభిన్నమైన కథనే ధనుష్ వినిపించారని తెలుస్తున్నది. రీసెంట్గా ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన తమిళంలో రూపొందించిన యూత్ఫుల్మూవీ ‘నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ సినిమా తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’గా విడుదలైంది. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘ఇడ్లీ కడై’ సినిమా త్వరలో విడుదల కానుంది. మరి రామ్‌చరణ్‌ను ధనుష్ డైరెక్ట్ చేయనున్నారన్న వార్తలో నిజం ఎంతుందో తెలీదుకానీ.. నిజంగా అది జరిగితే అభిమానులకు పండుగే.