Tollywood| ఇటీవల టాలీవుడ్ దర్శక నిర్మాతలు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే ఆడియన్స్‌కి కొత్త దనం అందించాలని తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలో వైవిధ్యమైన సినిమాలని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు హీరోలతో సినిమా చేయాలనే ఫార్ములాని పక్కన పెట్టి ఇతర ఇండస్ట్రీకి చెందిన హీరోలతోను ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన కాంబినేషన్ గురించి ఓ ప్రచారం నడుస్తుంది. ఇందులో భాగంగా పూరీ జగన్నాథ్-విజయ సేతుపతి కాంబోలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ నడుస్తుంది. అలానే సుకుమార్- షారూఖ్ కాంబోలో కూడా ఓ ప్రాజెక్ట్ రూపొందనుందనే ప్రచారం నడుస్తుంది.
లైగర్, డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరి జగన్నాధ్ తెలుగులో పలువురు హీరోలకు కథలు చెప్పిన ఎవరు అతనితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో పూరీ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి కథ చెప్పాడట. విజయ్ కూడా సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసాడని, పూరి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయగానే విజయ్ డేట్స్ ఇస్తాడని తమిళ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల మహారాజాతో భారీ హిట్ కొట్టిన విజయ్ సేతుపతి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నా విషయం మనకు తెలిసిందే. మరి ఈ కాంబో ఫిక్స్ అయితే సూపరో సూపరు.
ఇక మరో క్రేజీ కాంబినేషన్ కూడా సెట్ కానుందని తెలుస్తుంది.దర్శకుడు సుకుమార్, హీరో షారుఖ్ ఖాన్ కలయికలో ఒక సినిమా రాబోతోందని. మణిరత్నం, అట్లీ తర్వాత మరో సౌత్ డైరెక్టర్ తో పని చేసేందుకు బాద్షా ఉత్సాహపడుతున్నాడని ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది. కథ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతూ, హీరోకి కాస్త నెగెటివ్ టచ్ ఇవ్వబోతున్నాడట సుకుమార్. వీరిద్దరి కమిట్మెంట్స్ పూర్తయ్యాక మూవీ 2027లో పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్. పుష్ప ఫ్రాంచైజీతో భారీ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్.. షారూఖ్‌తో సినిమా చేస్తే ఇక ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉండడం ఖాయం.