టాలీవుడ్లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, తమిళ స్టార్ హీరో ధనుష్ ఒకే సినిమాలో నటించనున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మించనుండటం విశేషం.
ఇటీవలే కథను కూడా ఇద్దరు హీరోలకు వినిపించారట. ఇరువురూ ఈ కథకు ఓకే చెప్పారట. ఈ సినిమాకు దర్శకుడు, తదితర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అటు మోహన్లాల్కూ, ఇటు ధనుష్‌కూ తెలుగు రాష్ర్టాల్లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.