ప్రియదర్శి ప్రధాన పాత్రలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ‘కోర్ట్’ తెలుగులో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. హీరో నాని నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రామ్ జగదీశ్ దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ హక్కులను సీనియర్ హీరో ప్రశాంత్ పొందారు. తమిళ వెర్షన్‌కు ఆయన దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళ వెర్షన్‌కు ‘రంజన్’ అనే పేరుని ఖరారు చేశారు. సీనియర్ నటి దేవయాని కూతురు ఇనియా ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయం కాబోతున్నది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.