Court| ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల తీర్పు మారింది. ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా కథ బాగోలేకుంటే సినిమాని పక్కన పెట్టేస్తున్నారు. కథలో కంటెంట్ ఉంటే మాత్రం సూపర్ హిట్ చేస్తున్నారు. రీసెంట్గా కోర్ట్ అనే సినిమా చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్ అయింది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఈ మూవీ రూపొందింది.మౌత్ టాక్‌తోనే ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. విడుదలైన ఫస్ట్ రోజే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ చిత్రం తాజాగా రూ.50 కోట్ల క్లబ్లో చేరింది.మార్చి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మూవీ రిలీజ్ అయి పది రోజులు కాగా, ఈ పది రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు టీం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక పోస్టర్ రిలీజ్ చేస్తూ… ‘గొప్ప సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకుల హిస్టారికల్ తీర్పు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సినిమాదాదాపు రూ.9 నుంచి రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, మూవీకి భారీగానే లాభాలు వచ్చాయి. కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ ‘కోర్ట్’ మూవీని తెరకెక్కించారు. కోర్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామాగా పోక్సో యాక్ట్ నేపథ్యంలో సినిమా రూపొందించగా.. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, ‘శుభలేఖ’ సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు.
హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. వీరిద్దరు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మంగపతిగా శివాజీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. పాతకేళ్ల తర్వాత తనకి కరెక్ట్ రోల్ పడిందిని సక్సెస్ ఈవెంట్లో చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు శివాజి. మరి కొద్ది రోజులలో ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ‘కోర్ట్’ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ‘నెట్ ఫ్లిక్స్’ రూ.9 కోట్లకు సొంతం చేసుకోగా.. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.