సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. మానస వారణాసి కథానాయిక. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్నది.
ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు బుధవారం మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సినిమా డేట్‌ని అనౌన్స్ చేస్తూ హీరోహీరోయిన్లు సంతోష్‌శోభన్, మానస వారణాసి రిలీజ్ చేసిన వీడియో ఆడియన్స్‌ని అకట్టుకుంటున్నదని మేకర్స్ తెలిపారు.. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: ఆదిత్య రవీంద్రన్, సహ నిర్మాత: అజయ్కుమార్రాజు.పి