Mana Shankara Vara Prasad Garu | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నచిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. ఇప్పటికే పాటలను విడుదల చేసిన చిత్రయూనిట్.. జనవరి 04న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు ఇంకా 9 రోజులు ఉందని తెలుపుతూ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్లో చిరంజీవితో పాటు అమృతం ఫేమ్ హర్షవర్థన్, హీరోయిన్ కేథరిన్, అభినవ్ గోమఠం ఉన్నారు.

Mana Shankara Vara Prasad Garu