Dude Movie Copy Right Issue | సంగీత మాంత్రికుడు ఇళయరాజా మరోసారి కాపీరైట్ ఉల్లంఘన వివాదంతో వార్తల్లో నిలిచారు. తాజాగా విడుదలైన ‘డ్యూడ్’ (Dude) చిత్రంలో తన అనుమతి లేకుండా, తాను కంపోజ్ చేసిన రెండు పాటలను ఉపయోగించినందుకు గాను ఆయన చిత్ర బృందంకి కాపీరైట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది.
తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, సరైన రాయల్టీ చెల్లించకుండా ‘డ్యూడ్’ సినిమా మేకర్స్ ఈ పాటను సినిమాలో వినియోగించినట్లు ఇళయరాజా తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. అయితే దీనిపై స్పందించిన మద్రాస్ హైకోర్టు ఇళయరాజాకు న్యాయపరంగా ముందుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు ఇళయరాజా చేసిన ఈ ఆరోపణలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందన ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.