Coolie vs War 2 | ఆగస్ట్ 15న రెండు మల్టీ స్టారర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలపై దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ రెండు చిత్రాలు మరేవో కావు. కూలీ, వార్ 2. త్రిపుల్ ఆర్, దేవర తరవాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం వార్ 2 సినిమా కాగా, ఇది బాలీవుడ్ తొలి స్ట్రైట్ మూవీ. ఈ చిత్రం కోసం టాలీవుడ్‌తో పాటు బీటౌన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి పోటీగా కూలీ విడుదల కానుండడంతో కాస్త టెన్షన్ నెలకొంది.
కూలీ సినిమాతో పోలిస్తే ‘వార్ 2’ ప్రమోషన్లు అంతగా జరగడం లేదు. ‘కూలీ’ పాటలు, ఆ సినిమా పోస్టర్లు, నాగ్ ఇస్తున్న ఎలివేషన్లు అన్ని కూడా కూలీ సినిమాపై అందరి దృష్టి పడేలా చేస్తుంది. వార్ 2 నుండి ఒక్క టీజర్ మాత్రమే రాగా, దాని వలన పెద్దగా ఒరిగింది ఏమి లేదంటున్నారు. అయితే అందరు వార్ 2 ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ అయిన కనీసం సినిమాపై అంచనాలు పెంచాలి. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఈ సినిమాకు మూల స్థంభాలు కాగా, వాళ్లు ఈ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేయాలి.
‘వార్ 2’ తెలుగు రైట్స్ నిర్మాత నాగవంశీ చేతుల్లోకి వెళ్లిన విషయం మనకు తెలిసిందే. నాగ వంశీ ఎన్టీఆర్‌కి దగ్గర స్నేహితుడు కాగా, ఆయన ఎన్టీఆర్‌ని ప్రమోషన్స్ పరంగా ఎలా వాడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘వార్ 2’ నుంచి పాటలు, ప్రమోషన్ స్టఫ్ ఒక్కొక్కటిగా బయటకు తీయబోతున్నాడట. మరోవైపు తెలుగు నాట ఓ భారీ ఈవెంట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే కూలీ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ ఉండడంతో ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా క్రేజ్ లభించింది. మరి వార్ 2లో ఇద్దరు టాప్ హీరోస్ ఉన్నారు. దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. అయితే కూలీకి సౌత్ సినిమా అనే ముద్ర ఉండగా, ‘వార్ 2’కి అలాంటి భయం ఏమి లేదు. అయితే ఈ రెండు సినిమాల మధ్య పోటీ మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఫైట్‌లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.