Simon Trending | సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున పోషించిన సైమన్అనే విలన్ పాత్రపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. సినిమా విడుదల ముందు నుంచి ఈ పాత్రకు భారీ హైప్ ఉండడం వలన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా విడుదలయ్యాక సైమన్ పాత్ర తెలుగు ప్రేక్షకులని చాలా నిరాశపరిచింది. సైమన్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా ఊహించుకున్న తెలుగు ప్రేక్షకులకు లోకేష్ పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు.
ఇక తెలుగులో ఆకట్టుకోలేకపోయిన నాగార్జున సైమన్ పాత్ర తమిళ ప్రజలకు మాత్రం పిచ్చిపిచ్చిగా ఎక్కినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తమిళ అమ్మాయిలు అయితే సైమన్‌తో ప్రేమలో పడిపోయామని చెబుతున్నారు. అంతేగాకుండా.. నాగార్జున నటించిన రక్షకుడు(Rakshakudu) సినిమాలోని ‘సోనియా సోనియా’ అనే పాటకు సైమన్ విజువల్స్‌ని జత చేసి సోషల్ మీడియాలో రీల్స్ వదులుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియా అంతటా ట్రెండింగ్‌గా మారాయి. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలను మీరు చూసేయండి.
Insta is full of Tamil Ponnus simping on Simon 🔥#Coolie pic.twitter.com/TT7Fl4Sdbp
— AGENT (@HemsssWorth) August 17, 2025
Tamil girls going crazy about @iamnagarjuna stylishlooks and his #Simon role in #Coolie. ❤️🔥
— Suresh PRO (@SureshPRO_) August 18, 2025
Bro occupied the whole instagram 🔥#Simon #Coolie #NagarjunaAkkineni pic.twitter.com/qyDzpW5ajC
— Virat Karthik (@ViratKarthik28) August 18, 2025
Insta girls first thama videos chupinchi next Nag #Simon videos add cheyadam 😍😘
Back ground lo #SoniyaSoniya Song ❤️🔥
Edhi next level trend 📈 😎
I think TFI lo a hero ki ilanti trending ledu @iamnagarjuna sir 65 years age lo Girls ni me presence tho padesaru ante 🙏#Coolie pic.twitter.com/5c0iMjCH3Z— LENIN ✨ (@Akhilgaddam16) August 18, 2025