Super Star Rajinikanth – Coolie Movie Chikitu Vibe | సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే ఇండియాలో ఉన్న పలువురు సినీ ప్రముఖులు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలావుంటే ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
తలైవా ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ జోడీ కడుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించిన కథాంశంగా ఈ చిత్రం రూపొందుతుండగా ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. అయితే నేడు రజనీ బర్త్‌డే సందర్భంగా మూవీ నుంచి చికితు వైబ్(Chikitu Vibe) అంటూ క్రేజీ వీడియోను పంచుకున్నారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే రజనీ తన స్టెప్పులతో మరోసారి థియేటర్లు షేక్ చేస్తాడాని తెలుస్తుంది. ఫుల్ వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరు చూసేయండి.