War 2 Movie | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు సీక్వెల్‌గా రాబోతుంది. హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనుండగా.. ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 14న విడుదల కానుండగా.. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే ఈ సినిమా తెలుగు హక్కులకు సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
మొదటి భాగం ఘన విజయం సాధించడంతో, ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో మరియు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. చిత్రంపై ఉన్న బజ్ కారణంగా.. ‘వార్ 2’ తెలుగు వెర్షన్ కోసం భారీ ఆఫర్లు వచ్చాయి. ఒక టైంలో అయితే రూ.120 కోట్ల వరకు ఈ సినిమా రైట్లు వెళ్లినట్లు సమాచారం. అయితే చిత్రంపై ఉన్న బజ్ కారణంగా.. యష్ రాజ్ ఫిలింస్ ఎవరికి అమ్మకుంగా సొంతగా విడుదల చేద్దాం అనుకుంది. కానీ ఈ లోపే తమిళం నుంచి రజనీకాంత్ కూలీ కూడా ఆగష్టు 14నే వస్తుండటంతో ఆలోచనలో పడ్డారు మేకర్స్. దీంతో తాజాగా ఈ సినిమా హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకి అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజుకి ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో మంచి డిస్ట్రిబ్యూషన్ అనుభవం ఉండడంతో దిల్ రాజుకి ఇస్తే మూవీ మంచి వసూళ్లూ సాధింస్తుందని చిత్రబృందం భావించినట్లు సమాచారం.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు.