Super Star Rajinikanth | ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రేపు (12న) తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఇదిలావుంటే ఆయన బర్త్‌డే కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ‘వెట్టాయన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తలైవా ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ జోడీ కట్టుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించిన కథాంశంగా ఈ చిత్రం రూపొందుతుండగా ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది.
అయితే ఈ సినిమా నుంచి తలైవా బర్త్ డే కానుకగా.. రిలీజ్ డేట్‌తో పాటు స్పెషల్ గ్లింప్స్ వదలనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై ఈరోజు రాత్రి క్లారిటీ రానుంది. మరోవైపు తలైవా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘జైలర్’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగానికి కూడా నెల్సన్ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ను కూడా తలైవా బర్త్‌డే రోజు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో రజనీ అభిమానులు రెట్టింపు ఆనందంలో ఉన్నారు.