Anurag Kashyap | బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణ సమాజంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి వస్తున్న ఫూలే సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ పలు బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో.. ఈ సినిమాకు మద్దతుగా నిలిచిన అనురాగ్.. తక్కువ కులాలపై బ్రాహ్మణుల ఆధిపత్యం లేకపోతే మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్ లాంటి వాళ్లు ఎందుకు తిరగబడ్డారంటూ విమర్శించాడు.
అయితే ఈ వివాదం ఇంకా ముదరడంతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు అనురాగ్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తిట్టడం స్టార్ట్ చేశారు. ఈ విషయంలో ఆగ్రహాం వ్యక్తం చేసిన అనురాగ్ తాజాగా బ్రాహ్మణులపై మూత్రం పోస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో పాటు అతడి కుటుంబాన్ని చంపడంతో పాటు రేప్ చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ వివాదం ఇంకా ముదురుతుండడంతో తాజాగా బ్రాహ్మణ సమాజంకి క్షమాపణలు చెప్పాడు అనురాగ్.
ఇదిలావుంటే.. తాజాగా ఈ వివాదంపై మరోసారి క్షమాపణలు తెలిపాడు అనురాగ్. నేను కోపంలో ఒకరికి సమాధానం ఇవ్వబోతూ.. నా మర్యాదను మరచి, మొత్తం బ్రాహ్మణ సమాజంపై తప్పుగా మాట్లాడాను. ఈ వ్యాఖ్యలు తన జీవితంలో ఉన్న బ్రాహ్మణ సమాజానికి చెందిన స్నేహితులతో పాటు, కుటుంబ సభ్యులు, తాను గౌరవించే మేధావులను బాధించాయని అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆవేశంలో నేను చేసిన వ్యాఖ్యలు అసలు విషయాన్ని కూడా పక్కదారి పట్టించాయి. నేను ఈ సమాజాన్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడాలనుకోలేదు, కానీ ఆవేశంలో అనుచితంగా మాట్లాడాను, తన అసభ్యకరమైన మాటలు, ప్రవర్తన వలన.. తన స్నేహితులు, కుటుంబం, బ్రాహ్మణ సమాజం నుంచి తాను క్షమాపణ కోరుతున్నానని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, తన ఆవేశాన్ని నియంత్రించుకోవడానికి, సమస్యలను చర్చించేటప్పుడు సరైన పదజాలాన్ని ఉపయోగించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నన్ను మీరు క్షమిస్తారని ఆశిస్తున్నానంటూ అంటూ అనురాగ్ చెప్పుకోచ్చాడు.
मैं गुस्से में किसी को एक जवाब देने में अपनी मर्यादा भूल गया। और पूरे ब्राह्मण समाज को बुरा बोल डाला। वो समाज जिसके तमाम लोग मेरी जिंदगी में रहे हैं, आज भी हैं और बहुत कॉन्ट्रीब्यूट करते हैं। आज वो सब मुझसे आहत हैं। मेरा परिवार मुझसे आहत है। बहुत सारे बुद्धिजीवी, जिनकी मैं इज्जत…
— Anurag Kashyap (@anuragkashyap72) April 22, 2025