Sara Vicky Kaushal road trip | సారా అలీ ఖాన్‌తో బైకుపై విక్కీకౌశల్..పీఎస్‌లో ఫిర్యాదు..అసలేం జరిగింది..?
విక్కీ కౌశల్ అందరికీ షాక్ ఇస్తూ కత్రినాకు బదులు సారా అలీఖాన్ (Sara ali khan) బైకు (Vicky Kaushal Sara road trip)పై ఎక్కించుకుని ఇండోర్ వీధుల్లో (Indore Streets) చక్కర్లు కొట్టాడు. బైకుపై వెళ్తున్న స్టిల్ బయటకు రావడంతో కాంట్రవర్సీకి దారితీసింది.

బాలీవుడ్ (Bollywood) లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ (Vicky Kaushal)-కత్రినాకైఫ్ డిసెంబర్ 9న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ హనీమూన్ లాంటి ప్లాన్స్ ఏం లేకుండా షూటింగ్స్ మళ్లీ బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ అందరికీ షాక్ ఇస్తూ కత్రినాకు బదులు సారా అలీఖాన్ (Sara ali khan) బైకు (Vicky Kaushal Sara road trip)పై ఎక్కించుకుని ఇండోర్ వీధుల్లో (Indore Streets) చక్కర్లు కొట్టాడు. బైకుపై వెళ్తున్న స్టిల్ బయటకు రావడంతో కాంట్రవర్సీకి దారితీసింది. ఇంతకీ విషయమేంటనే కదా మీ డౌటు. విక్కీ కౌశల్ ప్రస్తుతం సారాఅలీఖాన్‌తో నటిస్తోన్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.
చిత్రీకరణలో భాగంగా విక్కీ-సారా బైకు (Bike ride)పై వెళ్తున్నారు. అయితే ఈ ఇద్దరు వెళ్తున్న బైకు ప్లేట్ నంబర్ వివాదానికి కారణమైంది. బైకు నంబర్ తన బైకు నంబర్ ను పోలి ఉందని ఓ వ్యక్తి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సినిమా షూటింగ్లో ఉపయోగించిన బైకు నెంబరు నాది, చిత్ర యూనిట్‌కి ఈ విషయం తెలిసిందో లేదో నాకు తెలియదు. కానీ ఇది చట్టవిరుద్ధం. అనుమతి లేకుండా నా నంబర్ ప్లేట్‌ను ఉపయోగించకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశాను.చర్యలు తీసుకోవాలని యాదవ్ అనే వ్యక్తి నేషనల్ మీడియాతో చెప్పుకొచ్చాడు.
నంబర్‌తో కన్ఫ్యూజన్..
దీంతో ఇండోర్ పోలీసులు షూటింగ్ జరుగుతున్న స్థలానికి వెళ్లి విచారించగా..బైకు ప్లేట్ నంబర్ 1కాగా దానిపై బోల్ట్ కారణంగా అది 4వ నంబర్ లా కనిపించడంతో ఫిర్యాదు దారు యాదవ్ ఈ తప్పిదం చేశాడని బంగాంగమ్ ఎస్ ఐ రాజేంద్ర సోని తెలిపారు.అయితే షూటింగ్లో ఉపయోగించిన బైకుప్రొడక్షన్ హౌజ్‌కు చెందిన వ్యక్తిదని చిత్రయూనిట్ ప్రతినిధి ఒకరు తెలియజేశాడు. మొత్తానికి ఒక్క బోల్ట్ ఇండోర్ పోలీసులకు తలనొప్పి తెప్పించిన తీరు ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

