BiggBoss Telugu | ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షో సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశాన్ని ఇస్తోందంటూ గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ అనే ఐదుగురు యువకులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ షో నిర్వాహకులు మరియు హోస్ట్ నటుడు నాగార్జునపై వారు ఫిర్యాదు దాఖలు చేశారు.
బిగ్ బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గుపడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్‌తో షోను నిర్వహిస్తున్నారని సమాజంలో సరైన విలువలు లేని వ్యక్తులను మాత్రమే షోకి ఎంపిక చేస్తున్నారని యువకులు ఆరోపించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి కంటెస్టెంట్లను ఎంపిక చేయడం ద్వారా షో ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుందని ఫిర్యాదుదారులు ప్రశ్నించారు. ఈ షోను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేరకపోతే, ప్రజా సంఘాలు మరియు మహిళా సంఘాలతో కలిసి బిగ్‌బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని, కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా షోను నిషేధించాలని వారు హెచ్చరించారు. నాగార్జున లాంటి సీనియర్ నటులు సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు మాత్రమే చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Biggboss