రాజ్‌తరుణ్ స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. సాంటో మోహన్ వీరంకి దర్శకుడు. నందకుమార్ అభినేని, భరత్ మగులూరి నిర్మాతలు. వర్ష కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు ‘జీవితంలో సరైన లక్ష్యంలేని వ్యక్తి ప్రేమ విలువ తెలుసుకొని తనకున్న ప్రతిభతో ఎలా రాణించాడన్నదే చిత్ర కథ. స్టాండప్ కమెడియన్‌గా రాజ్‌తరుణ్ పాత్ర చిత్రణ సరికొత్తగా ఉంటుంది. అతని హాస్యం నవ్వుల్ని పంచుతుంది’ అని చిత్ర బృందం తెలిపింది. టీజర్లో ‘నవ్వించాలంటే ముందు ఏడుపేంటో తెలియాలి’ అనే సంభాషణ ఆకట్టుకునేలా సాగింది. వెన్నెల కిషోర్, మురళీశర్మ, ఇంద్రజ, దేవిశ్రీప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవీంద్రన్, సంగీతం: స్వీకర్ ఆగస్తి, రచన-దర్శకత్వం: సాంటో మోహన్ నీరంకి.