Little Hearts Trailer | 90స్ మిడిల్‌క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి తనుజ్, శివాని నాగరం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు సాయి మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. జియో సిమ్ రాకముందు జరిగిన కథగా ట్రైలర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. సైనిక్‌పురిలో నివసించే అఖిల్, వాయుపురిలో ఉండే కాత్యాయని మధ్య సాగే ప్రేమకథ ఇది. చదువులో వెనుకబడిన విద్యార్థులైన వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుండి ఎదురైన అభ్యంతరాలు, చివరికి అఖిల్, కాత్యాయని ఒక్కటయ్యారా లేదా అనే అంశాలతో ఈ కథ నడుస్తుంది. ట్రైలర్ చూస్తుంటే, ఇందులో కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.
రాజీవ్ కనకాల, ఎస్.ఎస్. కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించగా, సాయి మార్తాండ్ రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమాలోని సంభాషణలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
Gear Up for Peak Entertainment from Sept 5th!❤️😆
Kickstart the Non-Stop Laughter Ride with the Hilarious #LittleHeartsTrailer💥💥
Full Fun Feast in theatres on Sept 5th🤩#LittleHeartsOnSep5th@etvwin @marthandsai #AdityaHasan @mouli_talks… pic.twitter.com/gQ1efbGlwf
— Mouli Talks (@Mouli_Talks) August 30, 2025