Actor Sudhakar | ఎనభై, తొంభై దశకాల్లో తన కామెడీ టైమింగ్‌తో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు సీనియర్ కమెడియన్ సుధాకర్. లప్పాం గిరి గిరి.. టేచల్ టేచల్.. పిచ్చ కొట్టుడు కొట్టారు వంటి డైలాగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఆయన తెరపై కనిపిస్తే చాలు ఆటోమేటిగ్గా నవ్వు మోహం మీదకు చేరుతుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఆయన చనిపోయాడంటూ కొన్ని ఫేక్ న్యూస్ వచ్చాయి. కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయి. అది చూసిన సుధాకర్ వెంటనే స్పందించి ‘నేను బతికే ఉన్నాను మొర్రో.. నా నవ్వు ఇంకా ఆగలేదు’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అయింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా సుధాకర్ జీ తెలుగులో ‘నేను నాన్న’ అనే కార్యక్రమంలో కనిపించాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్‌కు వచ్చిన సుధాకర్ అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. చాలా సన్నగా, మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందపడినట్లు అనిపించాడు. ఇక ఈ షోలో సుధాకర్‌కు ఆయన కొడుకు కేక్ తినిపిస్తూ ఫాదర్స్ డే విషెస్‌ను చెప్పాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక సుధాకర్ కూడా ‘అబ్బబ్బబ్బా’ అంటూ తన ఐకానిక్ డైలాగ్‌తో నవ్వించేశాడు. 45ఏళ్ల సినీ కెరీర్లో సుధాకర్ దాదాపు 600లకు పైగా సినిమాల్లో నటించాడు. కమెడియన్‌గా, సహాయనటుడిగా ఎన్నో విలక్షన్ పాత్రలు పోసించాడు. కమెడియన్‌గానే కాకుండా నిర్మాతగానూ యముడికి మొగుడు, తాతయ్య పెళ్లి మనవడి శోభనం వంటి సినిమాలకు రూపొందించాడు.