Rangabali Movie Promotions | రంగబలి ప్రమోషన్లో భాగంగా కమెడియన్ సత్య పలువురు యాంకర్లను అనుకరిస్తూ చేసిన స్పూఫ్ ఇంటర్వూ మంగళవారం విడుదలైంది. అయితే ఒకేసారి ఫుల్ ఇంటర్వూను రిలీజ్ చేయకుండా రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేశారు. ఎనిమిది నిమిషాల నిడివితో మంగళవారం విడుదలైన తొలిపార్టులో ఓపెన్ హార్ట్ విత్ సత్య, ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వూ విత్ దేవి ప్రియా అని రెండు స్పూఫ్ వీడియోలను రిలీజ్ చేశారు. రిలీజైన నిమిషాల్లోనే ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. కాగా ఇప్పుడు సెకండ్ పార్ట్‌ను రిలీజ్ చేశారు.
ఏడున్నర నిమిషాల డ్యురేషన్‌తో సెకండ్ పార్టు రిలీజైంది. రెండో పార్ట్‌లో ఇట్లు మీ డ్రాఫర్, ప్రెస్ మీట్ విత్ నరేష్ మండేటి, ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వూ విత్ వల్లి అని మూడు స్పూఫ్ వీడియోలను విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ప్రోమోలో చూపించన విధంగా ఈ ఇంటర్వూలేదు. కాగా ప్రోమో రిలీజైన తర్వాత సత్య ఇమిటేట్ చేసిన వారిలో ఒకరిద్దరూ హర్ట్ అయ్యారని సమాచారం. దాంతో చాలా వరకు ఎడిట్ చేసి ఈ వీడియోలను రిలీజ్ చేశారట.
ఇక రంగబలి విషయానికొస్తే.. పవన్ బసమ్శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరిజా నటిస్తుంది. సత్య కీలకపాత్రలో నటిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. దసరా తర్వాత ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తున్న సినిమా కావడంతో దాని తాలుకూ క్రేజ్ కూడా కాస్త ఉంది. ఈ సినిమాకు పవన్ సీహెచ్ స్వరాలు అందించాడు.
You all loved the Part-1, get ready for double dose of fun!
‘A spoof on Tollywood interviews ft. #Satya‘ Part 2 out now 💥
– https://t.co/bBeDCQE1m1#Rangabali in Cinemas on July 7th!@IamNagashaurya #YuktiThareja @PawanBasamsetti @pawanch19 @DivakarManiDOP @saregamasouth pic.twitter.com/xb0YEokS2e
— SLV Cinemas (@SLVCinemasOffl) July 5, 2023