Salaar Movie Box-office | మూడు రోజుల ముందు రిలీజైన సలార్ టీజర్ ఇప్పటికే వంద మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటేసింది. కోడికూత వినకముందే సలార్ ఊచకోతను చూపించి ప్రభాస్ అభిమానులను ఆనందపు అంచుల్లో నిలబెట్టాడు ప్రశాంత్ నీల్. జురాసిక్ పార్కులో డైనోసర్ ముందు ఏదైనా దిగదుడుపే అన్న రేంజ్లో ప్రభాస్‌కు ఎలివేషన్ ఇవ్వడం వేరే లెవల్. ప్రభాస్ ఫేస్‌ను పూర్తిగా చూపించకపోయినా టీజర్ ఇలా సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందంటే.. డైలాగ్ చెప్పించుంటే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా టీజర్ మాత్రం సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ చేసింది.
విజువల్స్ పరంగా చూసుకుంటే కేజీఎఫ్ చాయలు కనిపిస్తున్నా.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఒకరకమైన ఇంటెన్సిటీ చూపించి సలార్‌లో అంతకు మించి ఏదో ఉందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు. సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఒక్క టీజర్‌తో వీర లెవల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో సప్తగిరి ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. కాగా దానికి సంబంధించిన డబ్బింగ్ పార్ట్‌ను పూర్తి చేశాడు. ఈ మేరకు డబ్బింగ్ స్టూడీయోలోని ఫోటోను పోస్ట్ చేస్తూ సలార్ సినిమా బాక్సాఫీసు వద్ద ఖచ్చితంగా 2000 కోట్లు కొల్లగొడుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇక సలార్ ట్రైలర్ ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్నట్లు తాజాగా చిత్రబృందం స్పష్టం చేసింది. సినిమా రిలీజ్‌కు నెల రోజుల ముందే ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఓ కారణం కూడా ఉందట. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో కనీసం నెల రోజుల ముందే ట్రైలర్‌ను రిలీజ్ చేస్తే.. అప్పుడే కోరుకున్న స్థాయిలో హైప్ వస్తుందని అంచనా వేస్తున్నారట. సలార్ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ రిలీజ్ చేసేలా గట్టి ప్రయత్నాలే చేస్తుందట హోంబలే సంస్థ. అంతేకాకుండా విదేశాల్లోనూ పెద్ద ఎత్తన ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తుందట. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది.
#SALAAR 🔥🔥🔥Today, I finished dubbing for my role in the highly anticipated film #Salaar. it’s going to be a #doubleblockbuster. I’m confident that it will surpass the ₹2000cr mark at the box office. Thanks to #Panworld⭐️ Our #RebelStar #Prabhas #Garu & Director #Prashanthneel… pic.twitter.com/l2TMTyHf6w
— Sapthagiri (@MeSapthagiri) July 8, 2023