‘కలర్స్’ స్వాతి రెండో వివాహం
కథానాయిక ‘కలర్స్' స్వాతి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ఆమె రెండో వివాహం చేసుకున్నది. ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా స్వాతి వెల్లడించింది.
కథానాయిక ‘కలర్స్’ స్వాతి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ఆమె రెండో వివాహం చేసుకున్నది. ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా స్వాతి వెల్లడించింది. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో కలర్స్ స్వాతి నాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు శ్రీకాంత్తో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని తెలిసింది.
ఇప్పుడు ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో బుధవారం సంప్రదాయబద్ధంగా పెళ్లి వేడుక జరిగింది. కొత్త జంటకు పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసుని స్వాతి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకే ఈ జంట విడిపోయారు. అయితే తన విడాకుల విషయంపై స్వాతి ఎక్కడా స్పందించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

