డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల ఆ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే శుక్రవారం రాత్రి మేఘ విస్ఫోటం కారణంగా చమోలి జిల్లాలో కుంభవృష్టి కురవడంతో ఒకరు మరణించగా, పలువురు గల్లంతయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
భారీ వరదలకు పలు, భవనాలు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తరలి మార్కెట్, తరలి తెహ్సిల్ కాంప్లెక్స్ ప్రాంతాలు వరద నీరు, చెత్త, బురదతో నిండిపోయాయి. సబ్ డివిజనల్ మేజిస్టేట్ కార్యాలయం సహా పలు షాపులు, ఇళ్లు, వాహనాలు బురదతో నిండిపోయాయి. సగ్వారా గ్రామంలో శిథిలాల కింద ఒక బాలిక చిక్కుకుపోయి మరణించింది.