OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన మాస్ పర్ఫార్మెన్స్ చిత్రం ఓజీ సెప్టెంబర్ 25 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్, శ్రేయ రెడ్డి, శుభలేఖ సుధాకర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మి ‘ఓమీ’ అనే విలన్ పాత్రలో నటించి మంచి పాజిటివ్ బజ్ తీసుకొచ్చాడు. ఈ చిత్రం విడుదల సమయంలో థియేటర్లు ముందు అభిమానుల హడావిడి, మ్యూజిక్ ట్రాక్స్ వైరల్ అవ్వటంతో ఓజీ మేనియా ట్రెండింగ్‌గా మారింది.
అయితే చిత్రంలోని “ఫైర్ స్ట్రోమ్” పాట అభిమానుల్లో భారీ క్రేజ్ సృష్టించింది. ఇప్పుడీ క్రేజ్మరో స్థాయికి చేరుకుంది. ఓ కళాశాల ప్రాంగణంలో ఒక యువతి ఫైర్ స్ట్రోమ్ పాటపై క్లాసికల్ నృత్యం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. వందలాది విద్యార్థుల మధ్య ఆమె స్టెప్పులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే వైరల్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు “మాస్ పాటకి క్లాసికల్ డాన్స్! ఏం మిక్స్ ఇది?”, “పవన్ క్రేజ్ ఇలానే ఉంటుంది!” వంటి కామెంట్లు చేస్తున్నారు. ఇది ఓజీ సినిమాకి సంబరాన్ని మరింతగా పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ఓజీ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టగా, రానున్న రోజులలో అనేక రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు. ఇక మూవీ రిలీజ్ తర్వాత ఓజీ చిత్రానికి సీక్వెల్ వస్తుందా, ప్రీక్వెల్ వస్తుందా అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. ప్రీక్వెల్‌ని నానితో తీయబోతున్నట్టు ఓ ప్రచారం అయితే నడుస్తుంది. దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.