Pawan Kalyan | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమాలలో ఇప్పుడు అందరి దృష్టి ‘OG’ పైనే ఉంది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూవీపై మేకర్స్ విడుదల చేసిన ప్రతి అప్డేట్కి విపరీతమైన స్పందన వచ్చింది. లుక్ పోస్టర్స్, సెట్స్ స్టిల్స్, సోషల్ మీడియా ఇంటరాక్షన్.. అన్ని కూడా సినిమాకు సాలిడ్ బజ్ క్రియేట్ చేశాయి. కొన్ని రోజులుగా OG మూవీపై అఫిషియల్ అప్డేట్స్ తగ్గిపోయాయని అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. “డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా హ్యాండిల్‌కి ఏమైంది?”, “అడ్మిన్ మారిపోయాడా?” అంటూ కామెంట్లు పెట్టారు. కొందరు నెటిజన్లు అడ్మిన్ మార్పు జరిగింది అని చెప్పడంతో, ఆ వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
ఈ రూమర్స్‌ను ఖండిస్తూ, నిర్మాత కళ్యాణ్ దాసరి స్వయంగా స్పందించారు.”డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా హ్యాండిల్‌ని RRR టైమ్ నుంచి Wall & Trends టీమ్ చూసుకుంటోంది. ఇప్పటికీ అదే టీమ్ వర్క్ చేస్తోంది. ఎటువంటి మార్పులూ లేవు. రూమర్స్‌ను నమ్మకండి,” అని స్పష్టం చేశారు. అలాగే, OG మంచి కంటెంట్ ప్లాన్ చేసి అందిస్తాము, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.“ఓజీ అనేది ఒక సినిమా మాత్రమే కాదు, థియేటర్లలో జరిగే పండుగ లాంటి ఎక్స్పీరియన్స్. మేము బెస్ట్ కంటెంట్‌తో వస్తాం. చిన్న చిన్న గాసిప్స్‌కు రియాక్ట్ అవ్వొద్దు,” అని సూచించారు.
కొంతమంది ఫ్యాన్స్ “మేకర్స్ కొంతమందికి ఫేవర్ చేస్తున్నారంటూ” ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానిపై కూడా కళ్యాణ్ దాసరి క్లారిటీ ఇచ్చారు. “మా వైపు నుంచి ఎప్పుడూ అలాంటి ఫేవరిజం ఉండదు.యూట్యూబ్ లేదా సోషల్ మీడియా కాపీరైట్ స్ట్రైక్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో సాధారణమే. దాంట్లో ఎటువంటి పక్షపాతం లేదు” అని క్లారిటీ ఇచ్చారు. ఇక మ్యూజిక్ పరంగా చూస్తే థమన్ కంపోజ్ చేసిన ‘సువ్వి సువ్వి’ అనే మెలోడీ సాంగ్‌ను మరి కొద్ది నిమిషాలలో విడుదల చేయనున్నారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ కొత్త షేడ్స్ కనిపించనున్నాయట, ఫ్యాన్స్‌కి ఇది ఓ స్పెషల్ ట్రీట్‌గా మారనుంది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది.