Ram Charan | ఏడాదినర్థం కిందట మొదలైన రామ్‌చరణ్-శంకర్ల మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మొదట ఆరేడు నెలలు ఈ సినిమా షూటింగ్ సవ్యంగానే జరిగింది. ఎప్పుడైతే శంకర్ ఇండియన్-2 సినిమాను నెత్తిన వేసుకున్నాడో అప్పటి నుంచి గేమ్ చేంజర్ షూటింగ్‌కు కష్టాలు తప్పడం లేదు. హీరోలు ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేసిన సందర్భాలున్నాయి కానీ.. ఒక దర్శకుడు ఒకే సారి రెండు సినిమాలు చేయడం బహుశా ఇదే తొలిసారేమో. ఇక మరోవైపు మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా పూర్తవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ సెన్సేషనల్ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడీ సినిమా.. హిట్ సిరీస్ దర్శకుడు సైలేష్ కొలను చేతిలోకి వెళ్లిందని గత రెండు రోజుల నుంచి ఓ వార్త సంచలనం అవుతుంది. దాంతో శంకర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడా? అని జోరుగా కామెంట్స్ వస్తున్నాయి. అయితే తాజాగా ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సైలేష్ కేవలం గేమ్ ఛేంజర్‌కి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రమే చూసుకుంటున్నాడట. నటుడు రఘుబాబు తదితర కొందరు కారెక్టర్ ఆర్టిస్ట్ లపై సన్నివేశాలు మాత్రమే చేశాడట. అంతేగాని సినిమాలో హీరోపై కానీ ఏ ప్రముఖ సీక్వెన్స్‌లను కానీ సైలేష్ చేయ్యలేదని సమాచారం.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు కథ అందించాడు. చరణ్‌కు జోడీగా కియరా అద్వానీ, అంజలీలు నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సునీల్, ఎస్.జే సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ స్వరాలందిస్తున్నాడు.