Clap Movie On OTT | విభిన్న పాత్రలలో నటిస్తూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటుడు ఆది పినిశెట్టి. ఈయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘లైఫ్‌లో మనం ఓడిపోయేదెప్పుడో తెలుసా.. మన టాలెంట్ మీద మనకే నమ్మకం లేని ఆ క్షణం’ అంటూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రేసింగ్ కాంపెటీషన్లో రికార్డు హోల్డర్ అయిన భాగ్యలక్ష్మీ అనే అమ్మాయికి కోచింగ్ ఇవ్వడానికి ఎవరు మందుకు రాకపోవడంతో కాలు పోగోట్టుకున్న ఆది, ఆ అమ్మాయిని అథ్లేట్‌గా మార్చడానికి పడిన కష్టం ఏంటీ అనే కథాంశంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనిలివ్‌లో మార్చి 11 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి, ఎమ్.రాజ శేఖర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆకాంక్షసింగ్ హీరోయిన్గా నటించింది.