Citadel: Honey Bunny | స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యాక్షన్ వెబ్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే ఎక్కువమంది చూసిన వెబ్ సిరీస్‌గా సిటాడెల్ రికార్డును అందుకుంది.
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ సిరీస్ వచ్చింది. నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ సరికొత్త రికార్డులను సృష్టించినట్లు ప్రైమ్ వెల్లడించింది. అమెజాన్ వేదికగా ఈ వెబ్ సిరీస్ 200 దేశాల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే 150 దేశాల్లో ఇది టాప్ టెన్‌లో నిలిచినట్లు చిత్రబృందం తెలిపింది. బాలీవుడ్ నటులు కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించారు.
Proof that spies can break more than just codes—they break records!🍯🐰#CitadelHoneyBunnyOnPrime, watch now! pic.twitter.com/gktamZXXhq
— prime video IN (@PrimeVideoIN) November 13, 2024