Bhola Shankar | ‘సినిమాటోగ్రాఫర్‌కి రీమేక్ సినిమా చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒరిజినల్ని మ్యాచ్ చేస్తే సరిపోదు దాని కంటే ప్రతి విషయంలో ఒక అడుగు బెటర్‌గా వుండాలి. ఇది బిగ్ ఛాలెంజ్. అందుకే ‘భోళా శంకర్’ సినిమా విజువల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వున్నాం. ఖచ్చితంగా మాతృక కంటే ఇది బెటర్‌గా వుంటుంది’ అన్నారు డీవోపీ డడ్లీ. ఆయన సినిమాటోగ్రఫి అందించిన చిత్రం ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ సినిమా ‘వేదాలమ్’కు రీమేక్.
అగ్రనటుడు చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్ డడ్లీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు మోహర్ రమేష్ మన సినిమాలో చిరంజీవి హీరో అనగానే షాక్ అండ్ సర్ప్రైజింగ్గా అనిపించింది. చాలా థ్రిల్ల్‌గా ఫీలయ్యాను. ఆయనతో పనిచేసిన ప్రతి క్షణం మెమెరబుల్గా అనిపించింది.ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అవుట్ స్టాండింగ్. ఆయనకి టెక్నికల్ అంశాలపై కూడా మంచి నాలెడ్జ్ వుంది. ఈ చిత్రంలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా టఫ్‌గా అనిపించింది. చాలా పెద్ద యాక్షన్ సీక్వెన్స్ పార్ట్ అది. సినిమా అంతా గ్రాండ్‌గా విజువల్ ట్రీట్ వుంటుంది. మాతృకను మించి వుంటుంది’ అన్నారు.