సంతోష్ కల్వచర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఆర్టిస్ట్’. రతన్ రిషి దర్శకుడు. జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాత. త్వరలో సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని ‘చూస్తూ చూస్తూ నిన్నే చూస్తుండిపోయా.. చూస్తూ చూస్తూ నేనే నీవై పోయా..’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. రాంబాబు గోసాల రాసిన ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపరచగా,, కపిల్ కపిలన్ ఆలపించారు. హీరోహీరోయిన్ల మధ్య సాగే అందమైన రొమాంటిక్ సాంగ్ ఇదని, హోలీ పండుగ నేపథ్యంలో కలర్ఫుల్గా పాటను చిత్రీకరించామని మేకర్స్ తెలిపారు. తనికెళ్ల భరణి, సత్యం రాజేష్, ప్రభాకర్, వినయ్ వర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చందూ ఏజే, నిర్మాణం: ఎస్ జేకే ఎంటైర్టెన్మెంట్.