The Odyssey | హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ మరోసారి భారత్‌కు రాబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న కొత్త మైథిక్ యాక్షన్ ఎపిక్ ‘ది ఒడిస్సీ’ గ్లోబల్ థియేట్రికల్ రిలీజ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ జూలైలో ముంబైకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక నోలాన్ వెంట హాలీవుడ్ స్టార్స్ మాట్ డామన్, టామ్ హాలండ్, నిర్మాత ఎమ్మా థామస్ కూడా ఇండియాకు రాబోతున్నట్లు సమాచారం.
‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్స్టెల్లార్’, ‘టెనెట్’, ‘ఓపెన్‌హైమర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నోలాన్ ఇండియన్ రాబోతుండటంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక హోమర్ రచించిన గ్రీక్ ఇతిహాసం ‘ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మాట్ డామన్ ఒడిస్సియస్ పాత్రలో, టామ్ హాలండ్ టెలిమాకస్ పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, నోలాన్ సిగ్నేచర్ స్టైల్లో తెరకెక్కిన ఈ మైథిక్ యాక్షన్ ఎపిక్ కోసం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.ముంబైలో జరిగే గ్రాండ్ ప్రీమియర్ ఈవెంట్లో నోలాన్ టీమ్ పాల్గొని, ఇండియన్ మీడియా, అభిమానులతో ముచ్చటించనున్నారు.